నన్నెందుకు వేధిస్తున్నారు?.. ఫైర్ అయిన సుశాంత్ ఎక్స్ గాళ్‌ఫ్రెండ్!
on Mar 2, 2021
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మృతితో గుండెలు పగిలిన ఎంతోమంది ఫ్యాన్స్‌లో నటి అంకితా లోఖండే ఒకరు. సుశాంత్ మాజీ ప్రేయసిగా ఆమె వార్తలో నిలిచింది. ఆయన మృతి కేసులో తనకు తెలిసిన వివరాలన్నింటినీ అందించడమే కాకుండా, ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచిందామె. అయితే, తాజాగా ఆమె సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలను, ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది. కారణం.. తను హ్యాపీగా ఉన్న, డాన్స్ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తుండటం! తన హృదయంలో సుశాంత్‌కు ప్రత్యేకమైన స్థానం ఉందని మొదట్నుంచీ చెప్తూ వస్తున్న అంకిత రీసెంట్గా ఇన్‌స్టాగ్రమ్ లైవ్‌లో ఈ ట్రోల్స్‌ని తట్టుకోలేక బరస్ట్ అయ్యింది.
తన డిప్రెషన్ గురించి ఓపెన్ అయిన ఆమె, తాను చాలా హ్యాపీగా ఉన్నానని ఆరోపిస్తున్న వారిపై విరుచుకుపడింది. "ఇవాళ నావంక వేళ్లు చూపిస్తున్నవారికి నా అనుబంధం గురించి ఏమీ తెలియకపోవచ్చు. అతనిపై మీకు అమితమైన ప్రేమ ఉన్నట్లయితే, ఎందుకు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు? మా రిలేషన్షిప్ ముగిసిన టైమ్‌లో మీరెక్కడ ఉన్నారు? ఇవాళ నన్ను బ్లేమ్ చేస్తున్నారు, కానీ అందులో నా తప్పేమీ లేదు. ప్రతి ఒక్కరికీ లైఫ్‌లో భిన్నమైన ఉద్దేశాలుంటాయి. జీవితంలో ఎదగాలని సుశాంత్ ఎప్పుడూ ఆశించేవాడు, దానికోసం పనిచేసేశాడు. తనదైన మార్గంలో వెళ్లాడు. దానికి నన్ను బ్లేమ్ చేయడం ఏమిటి? నేనెందుకు వేధింపులకు గురవ్వాలి? నేనేం తప్పు చేశాను? నా కథేమిటో మీకు తెలీదు, కాబట్టి నన్ను తప్పుపట్టడం ఆపండి. ఇది నిజంగా గాయపరుస్తోంది." అని చెప్పింది అంకిత.
ఆరు సంవత్సరాల పాటు డేటింగ్లో ఉన్న సుశాంత్ సింగ్, అంకిత లోఖండే 2016లో తమ బంధానికి గుడ్‌బై చెప్పారు.
Also Read